News May 15, 2024

త్వరలోనే APలో బంగారం ఉత్పత్తి

image

AP: కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం గనిలో 2024 చివరికల్లా బంగారం ఉత్పత్తి మొదలవనున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ఇదే తొలి ప్రైవేటు బంగారు గని. దీని కోసం జెమైర్‌సోర్ సర్వీసెస్ కంపెనీ ఇప్పటికే 250ఎకరాల భూసేకరణ చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు 60%పూర్తయినట్లు సమాచారం. ఇది ప్రారంభమైతే ఏటా 750కిలోల బంగారం ఉత్పత్తవుతుందని అంచనా. దీనిపై ఇప్పటి వరకు రూ.200కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ తెలిపింది.

Similar News

News February 6, 2026

RRR ఉత్తర భాగానికి గ్రీన్ సిగ్నల్

image

TG: Hyd చుట్టూ 162KM మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన DPR సిద్ధమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. LSలో MP ఈటల రాజేందర్ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భూసేకరణ వ్యయంలో 50% భారం పంచుకునేందుకు TG అంగీకరించిందన్నారు. రాయల్టీ మినహాయింపు, GSTలోని రాష్ట్ర వాటా చెల్లింపునకూ ఓకే చెప్పిందన్నారు. ఈ ఏడాది CRIF నుంచి రూ.367.17 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

News February 6, 2026

శుక్ర దోషం ఎలా ఏర్పడుతుంది?

image

ఇందుకు చాలా కారణాలున్నాయి. జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. దీనివల్ల దోషం ఏర్పడి శుభ ఫలితాలు తగ్గుతాయి. సౌఖ్యాలు దూరమవుతాయి. శుక్రుడు రాహువు, కేతువు, శని గ్రహాలతో కలిసినా దోషం ఏర్పడుతుంది. ఇది వ్యక్తి నైతికతను, బంధాలను ప్రభావితం చేస్తుంది. జాతక చక్రంలో 6, 8, 12వ ఇళ్లలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. ఉంటే అనారోగ్యం, అప్పులు కలుగుతాయి. పూర్వజన్మ కర్మల వల్ల కూడా శుక్ర దోషం ఏర్పడవచ్చు.

News February 6, 2026

జూన్ 1న ఈఏపీసెట్ ఫలితాలు!

image

AP: ఈఏపీసెట్‌కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్‌కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్‌కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.