News February 10, 2025
గోల్డ్ రేట్.. ALL TIME RECORD

వివాహ శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.79,800లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.390 పెరగడంతో తొలిసారి రూ.87,060లకు చేరింది. అటు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
Similar News
News November 20, 2025
దక్షిణాఫ్రికాతో వన్డేలకు బుమ్రా, హార్దిక్ దూరం!

దక్షిణాఫ్రికాతో NOV 30 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్లు బుమ్రా, హార్దిక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని వీరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కాగా ఆసియాకప్లో గాయపడిన హార్దిక్ కోలుకుంటున్నారు. WC వరకు హార్దిక్ టీ20లపై ఫోకస్ చేస్తారని BCCI వర్గాలు పేర్కొన్నాయి. 2026 FEBలో T20 WC మొదలయ్యే ఛాన్స్ ఉంది.
News November 20, 2025
రైతులకు అండగా ఉండటం మా బాధ్యత: లోకేశ్

AP: సాగు తీరు మారాలి.. అన్నదాత బతుకు బాగుపడాలన్నదే తమ సంకల్పమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “ఇవాళ 46.85 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ కింద 2విడతల్లో కలిపి రూ.14 వేలు చొప్పున జమ చేశాం. అలాగే CM చంద్రబాబు వ్యవసాయాభివృద్ధికి పంచసూత్రాలు ప్రకటించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం వంటి మార్గదర్శకాలు సూచించారు” అని ట్వీట్ చేశారు.
News November 20, 2025
శబరిమల: చిన్నారుల ట్రాకింగ్కు ‘Vi బ్యాండ్’

శబరిమలలో చిన్నారులు తప్పిపోకుండా వొడాఫోన్-ఐడియా(Vi)తో కలిసి కేరళ పోలీసులు ‘సురక్ష బ్యాండ్’లను తీసుకొచ్చారు. చిన్న పిల్లలతో శబరిమల వెళ్లే భక్తులు Vi సెక్యూరిటీ కియోస్కుల వద్ద, కేరళలోని అన్ని Vi స్టోర్లలో ఈ సురక్ష బ్యాండ్లను పొందొచ్చు. ఆన్లైన్లో కూడా వీటికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాండ్కు ఒక స్పెషల్ డిజిటల్ కోడ్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు తప్పిపోతే వారిని దీని సాయంతో ట్రాక్ చేయొచ్చు.


