News March 14, 2025
ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.
Similar News
News October 14, 2025
474 ఇంజినీరింగ్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎల్లుండే (OCT 16)ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSC చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 14, 2025
391 పోస్టులకు BSF నోటిఫికేషన్

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ అర్హతతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించినవారు ఈ నెల 16 నుంచి నవంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 23ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి సడలింపు ఉంది. PST,సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
News October 14, 2025
వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?