News April 8, 2025

గోల్డ్ రేట్ టుడే!

image

USA విధించిన సుంకాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇవాళ కూడా గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹650 తగ్గి ₹89,730కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹600 తగ్గి ₹82,250గా పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.1,03,000గా ఉంది. కాగా, గత 5 రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,650 తగ్గడం విశేషం.

Similar News

News October 16, 2025

దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

image

గతేడాది దీపావళి సీజన్‌లో 10 గ్రాముల సిల్వర్ ధర రూ.1,100 ఉంటే ఈ ఏడాది అదే సమయానికి దాదాపు రెట్టింపయింది. ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత, మైనింగ్‌ తగ్గడం తదితర కారణాలతో ప్రస్తుతం KG వెండి ధర రూ.2 లక్షలు దాటింది. అయితే పండగ తర్వాత ధరలు తగ్గొచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సప్లై పెరగడం, కీలక రంగాల మందగమనం, ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

News October 16, 2025

AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది: మోదీ

image

ఏపీలో గూగుల్ లాంటి పెద్ద కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టిందని, ఇది సీఎం చంద్రబాబు విజన్ అని ప్రధాని మోదీ అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు ఏపీ తొలి గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ ఏఐ హబ్‌లో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్, ఎనర్జీ స్టోరేజీ, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా ప్రపంచానికి సేవలు అందించనుందని పేర్కొన్నారు.

News October 16, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 862 పాయింట్ల లాభంతో 83,467, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 25,585 వద్ద ముగిశాయి. Nestle, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్. HDFC లైఫ్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, జియో ఫైనాన్షియల్ టాప్ లూజర్స్.