News September 25, 2024

Gold Rate: ఎందుకు పెరుగుతోందంటే..

image

గోల్డ్ రేట్లు ఇన్వెస్టర్లకు హ్యాపీనిస్తే కస్టమర్లకు షాకిస్తున్నాయి. వారంలో విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.75,420గా ఉంది. ఇక ట్యాక్సులు కలుపుకుంటే రూ.76,189 వరకు ఉంది. US ఫెడ్ వడ్డీరేట్ల కోతతో డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, హెజ్బొల్లా యుద్ధంతో ఫిజికల్ గోల్డ్‌, గోల్డ్ ETFsకు డిమాండ్ పెరిగింది.

Similar News

News September 25, 2024

బెన్ స్టోక్స్ మరోసారి యూటర్న్?

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్‌లో దేశం తరఫున ఆడాలని సెలక్టర్లు, కోచ్ కోరితే తప్పకుండా ఆడతానని ఆయన తెలిపారు. కాగా 2022లో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2023WCలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వీడ్కోలు పలికారు. ఇప్పుడు మరోసారి పునరాగమనం చేయాలని భావిస్తున్నారు.

News September 25, 2024

దేశంలో ఏ ప్రాంతాన్నీ పాకి‌స్థాన్ అనొద్దు: సుప్రీంకోర్టు

image

ఏ వర్గం పైనా క్యాజువల్ కామెంట్స్ చేయొద్దని జడ్జిలను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్‌గా పిలవొద్దని ఆదేశించింది. అది భారత ప్రాంతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకమేనని తెలిపింది. KA హైకోర్టు జడ్జి, జస్టిస్ వీ శ్రీశానందన్ ఓ కేసులో బెంగళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని పాకిస్థాన్ అనడం, మహిళా లాయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియోల కేసును సుమోటోగా విచారించింది.

News September 25, 2024

ఖాతాల్లో రూ.25,000 జమ

image

AP: వరద బాధితుల అకౌంట్లలో ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేసింది. NTR జిల్లా కలెక్టరేట్‌లో పలువురు బాధితులకు CM చంద్రబాబు చెక్కులను అందించారు. మిగిలిన సుమారు 4 లక్షల మందికి ఖాతాల్లో జమ చేశారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ.10వేలు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది.