News August 17, 2025

గోల్డ్ vs కార్.. ఏది కొంటే మంచిది?

image

మిడిల్ క్లాస్ కుటుంబాలు కారు కంటే బంగారం కొనడమే ఉత్తమమని అనలిస్టులు సూచిస్తున్నారు. కారు విలువ 10-12 ఏళ్లలో 70-80 శాతానికి పడిపోతుందని, అదే బంగారం విలువ పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ‘ఖరీదైన ఫోన్, ట్రిప్‌లు తాత్కాలిక ఆనందం ఇచ్చినా సంపదను పెంచవు. వెకేషన్ 5 రోజులే ఉంటుంది.. కానీ బంగారం 5 తరాలు నిలుస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినా బంగారం విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.

Similar News

News August 17, 2025

అలాంటి సినిమాలను ఆపేయాలి: లోకేశ్

image

AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్‌ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్‌పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 17, 2025

‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ

image

ఓటర్ల గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమదేనని CEC జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఓట్ల చోరీ అంటూ ఈసీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఓటర్ల విషయంలో ధనిక, పేద, లింగ భేదాలు ఉండవని స్పష్టం చేశారు. బిహార్‌ ఓటరు జాబితా విషయంలో ECపై ఆరోపణలు చేస్తున్నారని, జాబితా తయారీలో స్పష్టమైన వైఖరితో ఉన్నామని తెలిపారు. బిహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు.

News August 17, 2025

రాబోయే గంటలో వర్షం

image

హైదరాబాద్‌లో రాబోయే గంట సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ <<17432128>>వర్షాలు<<>> పడతాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ADB, HNK, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వికారాబాద్, WGL జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.