News July 21, 2024
మంచు విష్ణుకు గోల్డెన్ వీసా

సినీనటుడు మంచు విష్ణుకు UAE గోల్డెన్ వీసా అందించింది. కళలు, సాహిత్యం, విద్య, పరిశ్రమలు, కల్చర్ వంటి రంగాల్లో అధ్యయనం చేసేవారికి ఈ వీసాను యూఏఈ జారీ చేస్తుంది. దీని ద్వారా దుబాయ్‌లో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా ఉండేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, మోహన్‌లాల్, చిరంజీవి, అల్లు అర్జున్, త్రిష, అమలాపాల్, మౌనీ రాయ్ తదితరులకు ఈ వీసా లభించింది.
Similar News
News November 2, 2025
వంటింటి చిట్కాలు

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
News November 2, 2025
జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్‌తో తనకు, జోగి రమేశ్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్‌కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్‌కు లేదన్నారు.
News November 2, 2025
MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<


