News September 6, 2024
గోల్డ్‌మన్ సాచ్స్ ఎఫెక్ట్.. 11.4% క్షీణించిన VI

Vodafone Idea షేర్ ధర శుక్రవారం 11.4% పడిపోయింది. ముందు రోజు ముగింపు రూ.15.09 నుంచి రూ.13.36 కనిష్ట స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో స్టాక్ ధరలో 83% భారీ క్షీణతను చూడవచ్చన్న గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల నేపథ్యంలో స్టాక్ నష్టాలబాటపట్టింది. ఈ లెక్కన స్టాక్ ధర రూ.2.5 స్థాయికి చేరుకోవచ్చని చెప్పింది. బలహీన వృద్ధి, మార్జిన్ ఆదాయం, బ్యాలెన్స్ షీట్ వల్ల ధర తగ్గవచ్చని అంచనా వేసింది.
Similar News
News November 28, 2025
సాలూరు: వేధిస్తున్నాడంటూ వ్యక్తిపై మహిళ ఫిర్యాదు

సాలూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. కారుణ్య నియామకం కోసం తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ఓ మంత్రి వద్ద అనధికారిక పీఏగా విధులు నిర్వహిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైందని వైసీపీ Xలో ఆరోపించింది.
News November 28, 2025
NIEPVDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 28, 2025
స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్‌వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


