News July 11, 2024
కెప్టెన్సీకి హసరంగ గుడ్ బై
టీ20 కెప్టెన్సీ నుంచి శ్రీలంక సారథి వనిందు హసరంగ తప్పుకున్నారు. టీ20 వరల్డ్ కప్లో తమ జట్టు ఘోర ప్రదర్శన చేయడంతోనే ఆయన తన కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. భారత్తో సిరీస్కు ముందు ఆయన తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా గతేడాది హసరంగ టీ20 జట్టు కెప్టెన్గా నియమితులయ్యారు. ఇప్పటివరకు పది మ్యాచులకు ఈ ఆల్రౌండర్ సారథిగా వ్యవహరించారు.
Similar News
News January 20, 2025
₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్
ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.
News January 20, 2025
నిందితుడికి జీవితఖైదు.. బాధితురాలి పేరెంట్స్ ఆందోళన
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్కి జీవితఖైదు విధించడంపై బాధితురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అతడికి ఉరిశిక్ష విధించాలని కోర్టు హాల్లో డిమాండ్ చేశారు. అప్పుడే తమ కూతురికి న్యాయం జరిగినట్లని వారు పేర్కొన్నారు. అటు ఈ దారుణం వెనుక మరింత మంది ఉన్నారని, సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని వారు వాదిస్తూ వస్తున్నారు.
News January 20, 2025
BIG BREAKING: కోల్కతా హత్యాచార దోషికి శిక్ష ఖరారు
దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, ₹50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 2024 AUG 9న RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.