News August 29, 2024
వైసీపీకి ఏడుగురు ఎంపీల గుడ్ బై?

AP: ఏడుగురు YCP రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, R.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. వీరందరూ రాజీనామా చేస్తే YCPకి మిగిలేది మరో నలుగురు MPలే. ఇవాళ మోపిదేవి, మస్తాన్ రావు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించనున్నారు.
Similar News
News January 16, 2026
గద్వాల్: పేదరికం జయించి.. 3 ప్రభుత్వ ఉద్యోగాలు

ధరూర్ మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. ఈరోజు మాదాపూర్ శిల్పకళావేదికలో నియామక పత్రాన్ని అందుకున్నారు. నాగరాజును తల్లి నర్సమ్మ కష్టపడి చదివించింది. పేద కుటుంబంలో పుట్టి మూడు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 2018లో పంచాయతీ సెక్రటరీ, గ్రూప్-4 ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం ఎర్రవల్లి బెటాలియన్-10లో ఉద్యోగం చేస్తున్నారు.
News January 16, 2026
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా EPF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి PFను ట్రాన్స్ఫర్ చేసే విధానం రానుందని పేర్కొన్నాయి. UPI పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ విధానం అమలుకు సమస్యల పరిష్కారంపై EPFO ఫోకస్ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
News January 16, 2026
NZతో టీ20 సిరీస్.. సుందర్ దూరం, జట్టులోకి శ్రేయస్

NZతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసింది. అలాగే తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీమ్‌లోకి వచ్చారని తెలిపింది.
టీమ్: సూర్య (C), అభిషేక్, శాంసన్, శ్రేయస్, హార్దిక్, దూబే, అక్షర్, రింకూ, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్, రవి బిష్ణోయ్


