News June 4, 2024
ఏపీకి మంచి రోజులు: అంబటి రాయుడు

AP: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 9, 2025
వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
News September 9, 2025
ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో అప్రెంటీస్‌లు

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-చాందీపూర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్సైట్: https://drdo.gov.in/
News September 9, 2025
రేపటి నుంచే పీఈసెట్ కౌన్సెలింగ్

AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.