News March 25, 2024
నీటి ఎద్దడి.. కారు వాష్ చేసినవారికి ఫైన్

బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతోంది. దీంతో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కారు వాషింగ్, గార్డెన్లు, భవన నిర్మాణాలకు నీటిని వాడుతున్నారు. దీంతో అధికారులు 22 మందిపై కేసులు బుక్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షల ఫైన్ వసూలు చేశారు. మరోవైపు వేసవి నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ చాలా ప్రాంతాల్లోని ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
Similar News
News January 27, 2026
అమరావతికి వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి

AP: రాజధాని అమరావతిని వ్యతిరేకించడం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ‘పార్లమెంటులో ప్రవేశపెట్టే అమరావతి బిల్లులో రైతులకు ఇచ్చిన హామీలనూ పొందుపరచాలి. వారికి న్యాయం చేయాలి. దీనిపై సభలో చర్చించాలి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News January 27, 2026
పద్మశ్రీ గ్రహీతపై కాంగ్రెస్ విమర్శలు.. శ్రీధర్ వెంబు కౌంటర్

పద్మశ్రీకి ఎంపికైన IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ.కామకోటిపై కేరళ కాంగ్రెస్ విమర్శలకు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కౌంటర్ ఇచ్చారు. ‘మైక్రో ప్రాసెసర్ డిజైన్‌పై కామకోటి పని చేస్తున్నారు. ఆయన అవార్డుకు అర్హులు. ఆవు పేడ, మూత్రంలో విలువైన మైక్రోబయోమ్‌లు ఉన్నాయి. ఇవి రీసెర్చ్‌కు పనికిరావనే బానిస మనస్తత్వం మనది’ అని విమర్శించారు. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారని కామకోటిని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
News January 27, 2026
ప్రాధాన్యత వారీగా ప్రాజెక్టుల పూర్తి: CBN

AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదే పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని కడపకు తీసుకెళ్లేలా చూడాలి. 10 జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తిచేయాలి’ అని సూచించారు. DP వరల్డ్ సంస్థ(దుబాయ్) ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయనుందని తెలిపారు.


