News December 18, 2024
నిరాశ్రయుల కోసం మంచి ఆలోచన!
చలి విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్లపై ఉంటోన్న నిరాశ్రయుల కోసం ఢిల్లీ ప్రజలు ముందుకొచ్చారు. వారిని చలి నుంచి రక్షించేందుకు బట్టలను సేకరిస్తున్నారు. ప్రజలకు దుప్పట్లు, స్వెటర్లు, వెచ్చని బట్టలను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు. దీంతో చాలా మంది చలి పులి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇలాంటి ఆలోచనే ఇతర నగరాల ప్రజలూ చేయాలని, నిరాశ్రయులకు సాయం చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
Similar News
News February 5, 2025
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ
‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 14లోపు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం. వరుణ్ ధావన్, కీర్తి, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ ‘తేరీ’(పోలీసోడు) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
News February 5, 2025
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ChatGPT సేవల కోసం ఇప్పటికే 18002428478 నంబర్‌ను తీసుకురాగా ఇప్పుడు సేవల పరిధిని పెంచింది. ప్రస్తుతం టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే రిప్లైలు ఇస్తూ ఉండగా ఇకపై ఆడియో, ఫొటో ఇన్‌పుట్స్‌కూ సమాధానాలు ఇవ్వనుంది. ఆ ఫొటో/వాయిస్ నోట్లో ఉన్న సమాచారం ఆధారంగా ChatGPT స్పందిస్తుంది. ఆ నంబర్‌ను సేవ్ చేసుకుని మనకు కావాల్సిన ప్రశ్నలకు ఆన్సర్లు తెలుసుకోవచ్చు.
News February 5, 2025
క్లాస్‌రూమ్‌లో విద్యార్థితో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం
బెంగాల్‌లోని వర్సిటీలో మహిళా ప్రొఫెసర్ విద్యార్థితో క్లాస్‌రూమ్‌లో <<15302833>>పెళ్లి చేసుకోవడం<<>> వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అధికారులు సెలవుపై పంపారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై వర్సిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఆ పెళ్లి ఓ ప్రాజెక్టులో భాగమని ప్రొఫెసర్ చెబుతున్నారు.