News August 18, 2025

GOOD IDEA: నాయకులారా.. మీరూ ఇలా చేయండి!

image

TG: ప్రజా ప్రతినిధులను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలను తీసుకొస్తుంటారు. వీటికి బదులు పుస్తకాలు, రగ్గులు తీసుకొస్తే పేదలకు పంచేందుకు ఉపయోగపడుతాయని కొందరు పిలుపునిచ్చారు. అయితే కాస్త కొత్తగా ఆలోచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. శాలువాలను పిల్లల డ్రెస్సులుగా మార్చారు. ‘Honour to Humanity’ పేరిట పేద పిల్లలకు వీటిని అందించనున్నారు. దీనిని అంతా ఫాలో అవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Similar News

News August 18, 2025

భారత్, పాక్ మ్యాచ్.. 10 సెకండ్లకు రూ.16లక్షలు

image

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవనున్న ఆసియా కప్‌లో భారత్, పాక్ తలపడే మ్యాచ్‌లకు యాడ్స్ పరంగా భారీ డిమాండ్ నెలకొంది. ఈ టోర్నీని బ్రాడ్‌కాస్ట్ చేయనున్న సోనీ TVలో 10సెకండ్ల యాడ్ స్లాట్‌కు రూ.16 లక్షల ధర నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. వచ్చే నెల 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. తర్వాత సూపర్-4 స్టేజ్‌లోనూ ఎదురుపడే అవకాశముంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే 28న టైటిల్ కోసం తలపడుతాయి.

News August 18, 2025

చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ

image

నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై మెగాస్టార్ చిరంజీవి దృష్టి సారించారు. నిన్న నిర్మాతలతో భేటీ అయిన ఆయన తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చిరు ఇంటికి వెళ్లారు. వారి డిమాండ్లపై ఆయన చర్చిస్తున్నారు. అదే సమయంలో ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రొడ్యూసర్లు సమావేశం అయ్యారు. కార్మికుల సమ్మె విరమణ ఇవాళ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

News August 18, 2025

కేంద్రమంత్రులతో నారా లోకేశ్ భేటీ

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కానూరు-మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీని కోరారు. అటు రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని నిర్మలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టీడీపీ పార్లమెంట్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్‌ను TDP, JSP ఎంపీలు ఘనంగా సత్కరించారు.