News October 11, 2025

గుడ్ ఐడియా.. పూల అమ్మకానికి సోషల్ మీడియా

image

పంట దిగుబడి బాగున్నా.. కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతుంటారు. దీనికి పరిష్కారంగా పంట అమ్మకానికి కొందరు రైతులు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. పూలు తెంపే 2,3 రోజుల ముందే ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. ఇది చూసి ఊరి జనం, చుట్టుపక్కల గ్రామాలవారు నేరుగా ఈ రైతులను సంప్రదించి.. తోటల నుంచే తాజా పూలను కొంటున్నారు. మిగిలిన వాటిని పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Similar News

News October 11, 2025

కాశీ సందర్శనకు తరలి వస్తున్న విదేశీయులు

image

పరమ పవిత్ర కాశీ నగరానికి విదేశీ భక్తులు తరలివస్తున్నారు. 2021లో కేవలం 2,566 మంది విదేశీయులు మాత్రమే కాశీని సందర్శించారు. ఆ సంఖ్య 2024 నాటికి 2.1 లక్షలకు పెరిగింది. 2025 జూన్ నెలలోనే 1.88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పురాతన ఆలయాల గొప్పదనం విశ్వ నలుమూలలకు విస్తరిస్తోందని చెప్పడానికి సంకేతం. విదేశీయులు సైతం కాశీకి రావడం భారత ఆధ్యాత్మిక వారసత్వ విజయానికి నిదర్శనం!

News October 11, 2025

ట్రంప్‌ది ఉరకలేసే హృదయం

image

అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. రెండోసారి బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 79 ఏళ్లు. కానీ ఆయన హృదయం మాత్రం 14 ఏళ్ల చిన్నదేనట. ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు. ఆయన గుండె, శరీరం వాస్తవ వయసుకన్నా తక్కువ ఉన్నట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలిందన్నారు. ఊపిరితిత్తులు, నాడులు, ఇతర అవయవాల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు చెప్పారు.

News October 11, 2025

CBSE స్కాలర్‌షిప్‌తో బాలికల చదువుకు ప్రోత్సాహం..

image

ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయ్యి, పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. చివరితేదీ అక్టోబర్‌ 23. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్‌ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: <>https://www.cbse.gov.in<<>>