News April 10, 2025

GOOD NEWS కాగజ్‌నగర్‌కు ట్రామా కేర్ సెంటర్

image

కాగజ్‌నగర్‌లో ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు HYDలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యదర్శి అంజన్ కుమార్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కలిసి ధన్యావాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ట్రామా కేర్ సెంటర్‌పై తాను మాట్లాడినందుకు కాగజ్‌నగర్‌లో దాన్ని మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 16, 2025

3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

News December 16, 2025

కర్నూలు: నడిరోడ్డుపై పసికందు.!

image

కర్నూలులో అమ్మ తనానికే మచ్చ తెచ్చే అవానవీయ ఘటన జరిగింది. నవ మాసాలు మోసి కన్న నెలలు నిండని పాపను రోడ్డుపై పడేసిందో కసాయి తల్లి. మంగళవారం ఉదయం నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ పేట రోడ్డుపై పాపను గుర్తించి సామాజిక కార్యకర్త అక్కున చేర్చుకున్నాడు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

News December 16, 2025

ఆరోగ్య భద్రతకు డిజిటల్ హెల్త్ రికార్డులు: CBN

image

AP: ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు CM CBN తెలిపారు. రియల్ టైమ్‌లోనే ఆరోగ్య వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామన్నారు. ‘రోగాలను ముందుగా నిరోధించే ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలి. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్‌పై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.