News March 29, 2024
GOOD NEWS: నిజామాబాద్‌లో IPL బిగ్ స్క్రీన్

క్రికెట్ ప్రేమికుల కోసం నిజామాబాద్ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్రాంరెడ్డి, సత్యపాల్ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 30, 31న బిగ్ స్క్రీన్ ద్వారా ఉచితంగా క్రికెట్ మ్యాచ్ చూడవచ్చన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News February 17, 2026
NZB: ‘గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలి’

పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్థ్యాలను చాటాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందని సూచించారు.
News February 17, 2026
NZB: 21 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌కు మేయర్ పీఠం

21 ఏళ్ల తరువాత నిజామాబాద్ నగరపాలక మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. కార్పొరేషన్‌గా మారిన తరువాత 2006లో జరిగిన తొలి ఎన్నికల్లో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. 2014, 2020లో జరిగి ఎన్నికల్లో BRS అభ్యర్థులు ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని వరుసగా దక్కించుకున్నారు. 21 ఏళ్ల తర్వాత.. కాంగ్రెస్ తరఫున కూరగాయల ఉమారాణి మేయర్ అయ్యారు.
News February 16, 2026
NZB: BRS మద్దతుతో కాంగ్రెస్ మేయర్ ఎంపిక

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూరగాయల ఉమారాణి BRS కార్పోరేటర్ మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టేశారు.


