News July 16, 2024
GOOD NEWS: నెల్లూరు: పోస్టాఫీసులో 116 ఉద్యోగాలు

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్లో 63, గూడూరు డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
Similar News
News November 14, 2025
షార్లో 141 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

సూళ్లూరుపేటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లో సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్సైట్ చూడగలరు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 14.
News November 14, 2025
గుడ్లూరు: హైవేపై విషాదం.. దంపతులు మృతి

గుడ్లూరు (M)మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో NTR(D) జి కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.
News November 13, 2025
నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.


