News July 16, 2024

GOOD NEWS: నెల్లూరు: పోస్టాఫీసులో 116 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 63, గూడూరు డివిజన్‌లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Similar News

News July 11, 2025

అక్టోబర్ 1కి అన్నీ పనులు ప్రారంభం: మంత్రి నారాయణ

image

నెల్లూరులోని అభివృద్ధి పనులపై టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నగర కార్పొరేషన్లో రూ.830 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. ఇప్పటికే డ్రైన్లలో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 1వ తేదీ కల్లా అన్ని పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

News July 11, 2025

నెల్లూరులో ప్రారంభమైన రెవెన్యూ క్రీడా వారోత్సవాలు

image

నెల్లూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ 10వ క్రీడా వారోత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. శుక్రవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. మూడు రోజులుపాటు ఈ క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. ఈ పోటీల్లో నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొననున్నారు.

News July 11, 2025

మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.