News September 11, 2024
GOOD NEWS: వరంగల్‌లో పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రెండు రోజులతో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలు క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా నేడు రూ.7,800 అయిందని మార్కెట్ అధికారులు తెలిపారు. ధరలు పెరగడం రైతులకు కొంత ఊరట లభించినట్టయింది. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News October 15, 2024
సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం: వరంగల్ సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇకపై పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు ఉంటే నోడల్ అధికారి ఫోన్ నంబర్ 9948685494కు తమ ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాల్సి ఉంటుందన్నాన్నారు.
News October 15, 2024
మడికొండ: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. సీఐ కిషన్ తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మదనపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల రమేశ్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి కుటుంబ సభ్యులకు సెల్ ఫోన్‌లో పంపించాడు. వారు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే మడికొండ పోలీసులు అప్రమత్తమై రమేశ్‌ను కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
News October 15, 2024
వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6500 ధర పలకగా, మక్కలు (బిల్టీ) ధర రూ.2,430 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 13,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. రైతులు నాణ్యమైన సరుకులు మార్కెట్ కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.