News March 13, 2025

GOOD NEWS.. హైదరాబాద్‌లోకి వికారాబాద్

image

హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్‌లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని 54 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.

Similar News

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 4 నుంచి 6 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2 నుంచి 3 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

వనపర్తి జిల్లాలో 75.56 శాతం పోలింగ్

image

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో సాయంకాలం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. మొత్తం 75.56% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. అమరచింత – 83.58%, ఆత్మకూర్ – 77.36%, కొత్తకోట – 78.71%, పెబ్బేరు – 83.11%, వనపర్తిలో 71.51% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 88,738 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

News February 11, 2026

రామగుండంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల సందర్శన

image

రామగుండం నగరపాలక సంస్థలో జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మునిసిపల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి, పురపాలక పరిపాలనా శాఖ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఓట్ల లెక్కింపు పోలింగ్ కేంద్రం, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తదితరులు ఉన్నారు.