News March 13, 2025
GOOD NEWS.. హైదరాబాద్‌లోకి NGKL గ్రామాలు

హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్‌లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా NGKL జిల్లాలోని 3 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.
Similar News
News April 10, 2026
కడప: యువతి గొంతు కోసి హత్య

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News April 10, 2026
గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్‌ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 10, 2026
భద్రాద్రి: తీరని కష్టాలు.. అర్ధరాత్రి డోలీలో గర్భిణి తరలింపు

రహదారి సౌకర్యం లేక గర్భిణులు పడుతున్న కష్టాలకు బూర్గంపాడు మండలం చింతకుంట నిదర్శనంగా నిలుస్తోంది. గురువారం రాత్రి మడవి సావిత్రి అనే 7 నెలల గర్భిణికి తీవ్ర అస్వస్థత కలగగా, అంబులెన్స్ వచ్చే వీలులేక గ్రామస్థులు ఆమెను డోలీలో 2 కిలోమీటర్లు మోసుకెళ్లారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి గ్రావెల్ రోడ్డు నిర్మించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.


