News September 29, 2024
GOOD NEWS: రైల్వేలో 14,298 ఉద్యోగాలు

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 9,144 టెక్నీషియన్ పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా వాటిని పెంచింది. 40 కేటగిరీల్లో 14,298 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. OCT 2 నుంచి 16 వరకు అప్లై చేసుకోవచ్చంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎడిట్ ఆప్షన్ ఇస్తామని, కొత్త పోస్టులకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
వెబ్సైట్: rrbapply.gov.in
Similar News
News November 21, 2025
వాట్సాప్లో అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్..

టీమ్స్, గూగుల్ మీట్ తరహా ఫీచర్ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాయిస్తోపాటు వీడియో కాల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాల్ పెడుతున్న ఉద్దేశం చెప్పొచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన లింకును కాపీ చేసి పార్టిసిపెంట్స్కు షేర్ చేయవచ్చు. కాల్ మొదలయ్యే ముందు పార్టిసిపెంట్స్కు నోటిఫికేషన్ వెళుతుంది.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.


