News March 25, 2024

GOOD NEWS: ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం డీఏ

image

TG: ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరవు భత్యం(DA) చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. వేతన సవరణ తర్వాత ఉండే మూలవేతనంపై DAని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ఇటీవల HRAలో కోత <<12870113>>విధించడంతో<<>> జీతం తగ్గి నిరాశలో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు ఊరట లభించింది. త్వరలోనే డీఏపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం.

Similar News

News December 6, 2025

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: వీసీ

image

కాళోజి నారాయణరావు వర్సిటీ పరిధి కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నూతన వీసీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. వర్సిటీ వీసీగా శనివారం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే కళాశాల నుంచి అడ్మిషన్ సైతం తొలగిస్తామన్నారు. వైద్య విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కావద్దని సూచించారు.

News December 6, 2025

ఆడపిల్ల పుడితే రూ.10,000.. పండుగకు రూ.20,000!

image

TG: పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సిరిసిల్ల(D) ఆరేపల్లిలో ఓ అభ్యర్థి ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మెదక్(D) కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఏకంగా 15 హామీలను బాండ్ పేపర్‌పై రాసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ఆడపిల్ల పుడితే ₹2వేలు, తీజ్ పండుగకు ₹20వేలు, అంత్యక్రియలకు ₹5వేలు వంటి హామీలున్నాయి.

News December 6, 2025

శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

image

AP: విద్యుత్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.