News March 5, 2025
GOOD NEWS.. 5 అదనపు సెలవులు

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి అదనంగా 5 క్యాజువల్ సెలవులు మంజూరు చేసింది. తమకు క్యాజువల్ లీవ్స్ తక్కువగా ఉన్నాయని, పెంచాలని ఆయా ఉద్యోగులు చేసిన విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ సెలవులు మంజూరు చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనుంది.
Similar News
News October 30, 2025
జేజమ్మగా శ్రీలీల.. నిర్మాతగా అల్లు అరవింద్?

అనుష్క నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘అరుంధతి’ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో జేజమ్మగా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని, ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని టాక్. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News October 30, 2025
జగన్ ఫోన్ నంబర్ పిటిషన్ కొట్టివేత

AP మాజీ CM జగన్ లండన్ పర్యటన సందర్భంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారంటూ CBI దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉన్నారా లేదా? మాత్రమే చూడాలంది. ఆయన పర్యటన నుంచి తిరిగొచ్చినందున CBI పిటిషన్కు కాలం చెల్లిందని పేర్కొంది. జగన్ ఎప్పుడు స్వదేశానికి వచ్చారో వివరాలతో మెమో దాఖలు చేయాలంది. పెద్ద కుమార్తెను చూసేందుకు OCT 11న జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.
News October 30, 2025
జీవ ముక్తికి మార్గం ఈ కార్తీక మాసం

ఈ పవిత్ర మాసంలో కార్తీక వ్రతం ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు. స్త్రీ, పురుష, వయో భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా చేయనివారు ‘అంధతామిత్రము’ అనే నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో కావేరీ నదీ స్నానం, దీపారాధన, దీపదానం చేయడం పుణ్యప్రదం. ధన-ధాన్య-ఫల దానాలు కూడా అమిత ఫలదాయకాలు. ఈ 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని చదివినా, విన్నా జీవన్ముక్తి లభిస్తుంది. <<-se>>#Karthikam<<>>


