News August 30, 2024
GOOD NEWS: మీసేవలో మరో 9 రకాల సర్టిఫికెట్లు

TG: MRO ఆఫీసులో మాన్యువల్గా అందించే 9 రకాల సర్టిఫికెట్లను మీసేవలో అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వాటిలో GAP సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, లోకల్ క్యాండిడేట్, మైనార్టీ సర్టిఫికెట్, రీఇష్యూ సర్టిఫికెట్స్(ఏడాదిలోపు ఇన్కమ్, క్యాస్ట్ పత్రాలు) ఉన్నాయి. క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, ఓల్డ్ రికార్డ్స్(ఖాస్రా, సెస్సాలా పహాణీ), ROR 1B కాపీలను పొందవచ్చు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


