News August 20, 2024
GOOD NEWS: అక్టోబర్ నుంచి BSNL 4G!

దేశంలో BSNL 4G సర్వీసులు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రయల్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4G సర్వీసులను ఆక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ప్రారంభానికి ముందు మరిన్ని ట్రయల్స్ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో 25 వేల టవర్లను ప్రారంభించిన BSNL తన కస్టమర్లకు 4G సిమ్ కార్డులను జారీ చేస్తోంది.
Similar News
News April 2, 2026
బీజేపీతో జాగ్రత్త.. TDPకి ఆప్ ఎంపీ హెచ్చరిక

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని, ఆ పార్టీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలని సూచించారు.
News April 2, 2026
ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.
News April 2, 2026
ఈ సాయంత్రం దీపాలు వెలిగిద్దాం: లోకేశ్

AP: అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రక విజయాన్ని వేడుకలా చేసుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మన రాజధాని.. మన గౌరవం’ అని ట్వీట్ చేశారు.


