News January 30, 2025

గుడ్ న్యూస్.. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఛాన్స్

image

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఏపీ ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. రేపటి వరకు రూ.3వేల ఫైన్‌తో తత్కాల్ స్కీమ్‌లో ఫీజు చెల్లించవచ్చని ప్రకటనలో తెలిపింది. కాలేజీలు, విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఈ అవకాశం కల్పించింది. మరోసారి పెంపు ఉండబోదని స్పష్టం చేసింది.

Similar News

News January 30, 2025

ఇన్‌ఫ్లూయెన్సర్లకు సజ్జనార్ వార్నింగ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లకు TGSRTC ఎండీ సజ్జనార్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘యువతను బెట్టింగ్, గేమ్స్ వైపు పురిగొల్పితే, అది వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్ర‌కారం నేర‌మే. అయినా కొంతమంది తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ప్రమోట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులు. ఏం చేసినా నడుస్తుందనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు.

News January 30, 2025

గెలవగానే టీడీపీ భరతం పడతాం: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం రాగానే టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు. తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని, దాడులకు ప్రతిదాడులు కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. తాము గెలవగానే తడాఖా చూపిస్తామన్నారు. కడప, రాయచోటి వైసీపీ సమన్వయ సభల్లో పెద్దిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

News January 30, 2025

హరీశ్ వ్యాఖ్యలు విడ్డూరం: సామ రామ్మోహన్

image

రేవంత్‌ను ప్యాలెస్ CM అని హరీశ్ రావు విమర్శించడం విడ్డూరంగా ఉందని TPCC నేత సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టిందెవరో అందరికీ తెలుసని దెప్పిపొడిచారు. తెలంగాణలో చిన్న పిల్లాడిని అడిగినా ప్రజల సీఎం ఎవరో చెబుతారన్నారు. రేవంత్ పనితీరు చూసి కడుపుమంటతోనే BRS అర్థరహిత విమర్శలు చేస్తోందని రామ్మోహన్ ఆరోపించారు. ముందు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో BRS తెలుసుకోవాలని హితవు పలికారు.