News October 10, 2024

GOOD NEWS.. ఆ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికెట్

image

AP: ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు రెగ్యులర్‌గా అందించే సర్టిఫికెట్‌తో పాటు జాతీయ స్థాయిలో ఇచ్చే NCVTE సర్టిఫికెట్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం NCVTEతో ఇంటర్ బోర్డు అఫిలియేట్ కానుంది. రాష్ట్రం వెలుపల వృత్తి విద్యలో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. APలోని 722 కాలేజీల్లో ఉన్న 23 ఒకేషనల్ కోర్సుల్లో ఏటా 80-90 వేల మంది చదువుతున్నారు.

Similar News

News November 18, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(1/2)

image

పాడి పశువులకు వరిగడ్డి, చొప్పలాంటి ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత ఉండాలి. పశువు శరీర బరువు, పాల మోతాదును అనుసరించి మేత అందిస్తే దాని పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1-1.5 కిలోల ఎండు మేత, 3-5 కిలోల పచ్చిమేత తింటుంది. నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1-1.5 కిలోల దాణా మిశ్రమం సరిపోతుంది. ఎక్కువగా ఇచ్చి వృథా చేయకూడదు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(2/2)

image

5 లీటర్ల కంటే ఎక్కువ పాలిచ్చే ఆవులకు.. అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణా ఎక్కువగా ఇవ్వాలి. అదే విధంగా 5 లీటర్ల కంటే ఎక్కువ పాలిచ్చే గేదెలకు.. అదనంగా వచ్చే ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి ఒక కిలో చొప్పున దాణా ఎక్కువగా ఇవ్వాలి. పశువుకు కావలసిన దాణాను 2 సమాన భాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే సమయానికి అరగంట ముందు అందివ్వాలి. ఈ విధంగా పశువుల అవసరాన్నిబట్టి మేత అందించాలి.