News March 19, 2024
ఆధార్: సందేహాలుంటే అడిగేయండి

ఆధార్ కార్డుకు సంబంధించిన సందేహాల నివృత్తికి ‘ఆధార్ మిత్ర’ పేరుతో కొత్త ఫీచర్ చాట్ బాట్‌ను UIDAI తీసుకొచ్చింది. దీంతో ఆధార్ PVC కార్డ్ స్టేటస్, ఎన్రోల్మెంట్/అప్డేట్ స్టేటస్, ఎన్రోల్మెంట్ సెంటర్ లొకేషన్, రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు https://uidai.gov.inలోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ Frequently asked questionsలో Have any Question? దగ్గర మీరు ప్రశ్నలు అడగవచ్చు.
Similar News
News September 8, 2025
రజినీకాంత్‌తో పోటీ లేదు: కమల్ హాసన్

రజినీకాంత్‌కు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని కమల్ హాసన్ తెలిపారు. ఆడియన్సే తమ మధ్య కాంపిటీషన్ ఉన్నట్లు భావిస్తారని అన్నారు. ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని అనుకునేవాళ్లం. ఎప్పటినుంచో కలిసి నటించాలనుకుంటున్నాం. త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని వెల్లడించారు. కాగా రజినీ, కమల్ హీరోలుగా లోకేశ్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
News September 8, 2025
భారత్ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్

అత్యధిక పరుగుల తేడాతో వన్డే మ్యాచ్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన <<17643575>>మూడో వన్డేలో<<>> ఆ జట్టు 342 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమ్ ఇండియా 317 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2023లో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై 309 రన్స్ తేడాతో గెలుపొందింది.
News September 8, 2025
నేడు CPGET-2025 ఫలితాలు

TG: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2025) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. గత నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. CPGET <