News September 21, 2024

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

image

AP: ఎంఎన్‌సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్‌డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు.

Similar News

News December 8, 2025

జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్‌‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.

News December 8, 2025

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News December 8, 2025

ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

image

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.