News September 1, 2025
మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 వరకు బార్లు

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నూతన బార్ పాలసీ అమలు కానుంది. దీంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి. ఈ పాలసీ మూడేళ్లపాటు అమలులో ఉండనుంది. కాగా గతంలో రాత్రి 11 గంటలకే బార్లు మాసి వేసేవారు. కానీ ఈ కొత్త పాలసీతో అదనంగా మరో గంటపాటు బార్లను నిర్వహించుకోవచ్చు. కాగా ఈ పాలసీలో 10 శాతం బార్లను కల్లు గీత కార్మికులకు కూడా కేటాయించారు.
Similar News
News September 4, 2025
OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News September 4, 2025
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా

APలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1.63 కోట్ల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది.
News September 4, 2025
పత్తిలో జింకు లోప లక్షణాలు – నివారణ

ఈ లోపం మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. ఆకులు, ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్యభాగం పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింక్ లోపం గల నేలల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మొక్క మీద లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.