News July 31, 2024

అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్

image

TG: అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. రిటైరయ్యే టీచర్లకు ప్రస్తుతం రూ.లక్ష ఇస్తుండగా, ఇకపై రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే కార్యకర్తలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచి ఇస్తామని వెల్లడించారు. ప్రతిపాదనలకు ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినట్లు పేర్కొన్నారు.

Similar News

News April 9, 2026

ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

image

నిజంగా ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం ఇస్తే ఎంత బాగుంటుందో కదా! స్పెయిన్‌లోని అరెనిల్లాస్ అనే గ్రామం ఫ్యామిలీస్‌కు ఈ ఆఫర్ ఇస్తోంది. అయితే స్కూలుకు వెళ్లే పిల్లలు ఉండాలని, శాశ్వతంగా అక్కడే నివసించాలని, విలేజ్ బార్ నడపాలని, మున్సిపల్ పని చేయాలని కండిషన్లు పెడుతోంది. ప్రస్తుతం అక్కడ 40 మందే ఉండటంతో జనాభా పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ప్రకటన చేయగానే 100 దరఖాస్తులు వచ్చాయట.

News April 9, 2026

రాజ్ లేకుండా ఒక్క రోజూ ఉండలేను.. సమంత ఎమోషనల్

image

తన భర్త రాజ్ గురించి చెబుతూ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. తర్వాత నేను ఒక బెటర్ పర్సన్‌గా, బెటర్ యాక్ట్రెస్‌గా కావడానికి భర్త రాజ్ కారణం. మేం కలిసే వర్క్, వర్కవుట్స్ చేస్తాం. గేమ్స్ ఆడతాం. ఆయనను విడిచి నేను ఒక్క రోజు కూడా ఉండలేను’ అని పేర్కొన్నారు. కాగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మే 15న విడుదల కానుంది.

News April 9, 2026

పాస్ పుస్తకాల్లో కరెన్సీకి వాడే టెక్నాలజీ: సీఎం

image

AP: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారం, భద్రత, గౌరవమని CM CBN చెప్పారు. YCP హయాంలో ప్రజల భూమిపై కన్నేశారని ఆరోపించారు. బాపట్ల(D) సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే 21.23L కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాం. జులై నాటికి మరో 9 లక్షలు, 2027 మార్చికి 80 లక్షల పాస్ బుక్స్ అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీ ఇందులో వాడుతున్నాం. వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరు’ అని చెప్పారు.