News October 14, 2024
ఏపీ, తెలంగాణకు గుడ్న్యూస్

AP, TGలో పలు రోడ్ల నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నల్గొండలో రూ.516 కోట్లతో 4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించనుంది. దీని ద్వారా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ మధ్య ట్రాఫిక్ సమస్య తీరనుంది. అటు APలో రూ.400 కోట్లతో 200KM మేర 13 స్టేట్ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
Similar News
News January 11, 2026
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్(<
News January 11, 2026
చర్మానికి స్క్రబ్ ఎందుకు చెయ్యాలంటే?

పని ఒత్తిడిలో పడి చాలామంది చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో మృతకణాలు చేరి చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు స్క్రబ్బింగ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. దీనికోసం బాత్సాల్ట్, డీప్ క్లెన్సింగ్ మిల్క్ వాడొచ్చు. లేదంటే గులాబీరేకల ముద్దలో తేనె, పాలు, ఉలవపిండి కలిపి చర్మానికి పట్టించి స్క్రబ్ చెయ్యాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.
News January 11, 2026
ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి

TG: ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


