News February 11, 2025

APSRTC ఉద్యోగులకు తీపికబురు

image

APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ బకాయిలో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దాదాపు రూ.60 కోట్ల మేర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఇప్పటికే 50 శాతం బకాయిలు చెల్లించినట్లు ఆయన గతంలో వెల్లడించారు.

Similar News

News January 23, 2026

పూర్తిగా సహకరించా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించా. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగా’ అని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

News January 23, 2026

MBBS సీటు కోసం కాలును నరుక్కున్నాడు

image

దివ్యాంగుల కోటాలో మెడికల్ సీటు పొందేందుకు ఓ వ్యక్తి తన కాలును తానే నరుక్కున్నాడు. UPలోని జౌన్‌పూర్‌(D)కు చెందిన సూరజ్‌ భాస్కర్‌ (20) NEET పరీక్షలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. దివ్యాంగుల కోటాలో అయితే ఈజీగా సీటు వస్తుందని భావించి కాలును నరుక్కుని దాడిలో కోల్పోయానంటూ నాటకమాడాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు న్యాయ సలహా కోరారు.

News January 23, 2026

ల్యాండ్ రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలి: SC

image

దేశంలో బలహీనమైన ల్యాండ్ రికార్డుల వ్యవస్థతో భూ వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయని SC వ్యాఖ్యానించింది. ల్యాండ్ రికార్డులు ట్యాంపర్‌కు ఆస్కారం లేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోడ్రన్ ఎకానమీలో ప్రాపర్టీ టైటిల్స్ శాంక్టిటీతో ఉండాలని జస్టిసులు రాజేశ్ బిందాల్, మన్మోహన్ అభిప్రాయపడ్డారు. రిజిస్టర్డ్ డాక్యుమెంటు లాంఛనం కాదని ఓకేసులో పేర్కొన్నారు.