News March 24, 2025

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్

image

బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకున్న తేదీ కన్నా ముందుగానే రానున్నట్లు తాజాగా తెలిపారు. ఏప్రిల్ 4న ఈ చిత్రం రీరిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. భారత దేశ సినీ చరిత్రలోనే తొలి టైమ్ ట్రావెల్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది.

Similar News

News November 11, 2025

ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్​ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్​

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్​, అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/

News November 11, 2025

మహిళా ఐఏఎస్‌కు గృహ హింస వేధింపులు

image

సామాన్య మహిళలకే కాదు చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న ఉమెన్ బ్యూరోక్రాట్లకు గృహ హింస తప్పట్లేదు. IAS ఆఫీసర్ అయిన తనభర్త ఆశిష్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ IAS భారతి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లో జరిగింది. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశిష్ సామాజిక న్యాయం విభాగంలో డైరెక్టర్ కాగా, భారతి ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

News November 11, 2025

‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.