News January 23, 2025

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్

image

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.

Similar News

News November 28, 2025

KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

image

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.

News November 28, 2025

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

image

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు.

News November 28, 2025

బాపట్ల జిల్లాపై తుఫాన్ ప్రభావం..!

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ మ్యాప్ విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం వలన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.