News January 24, 2025
BSNL కస్టమర్లకు గుడ్న్యూస్

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో దేశంలో 65వేలు+ 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 2వేల కంటే ఎక్కువ టవర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్లో 675, రంగారెడ్డిలో 100, మెదక్లో 158, నల్గొండలో 202, మహబూబ్నగర్లో 151, ఆదిలాబాద్లో 141, నిజామాబాద్లో 113, కరీంనగర్లో 98, వరంగల్లో 231, ఖమ్మంలో 219 టవర్స్ ఏర్పాటు చేశామంది.
Similar News
News November 17, 2025
NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 17, 2025
మణికంఠుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం

శబరి యాత్రకు వెళ్లేవారికి పేరూర్తోడు అనే పవిత్ర వాగు గురించి తెలిసే ఉంటుంది. ఇది ఎరుమలై నుంచి 5KM దూరంలో ఉంటుంది. పూర్వం అయ్యప్ప స్వామి పులి పాల కోసం ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఆగి, విశ్రాంతి తీసుకున్నట్లుగా చెబుతారు. ఈ కారణంగానే పేరూర్తోడును ఆ చుట్టుపక్కల మెచ్చిలి సుబరి పీఠం వరకు కనిపించే అడవిని ‘పూంగా’ (ఉద్యానవనం)గా భావిస్తారు. ఈ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా కొలచి పూజిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 17, 2025
బిహార్ ‘మహాగురు’.. MLAగా గెలవలేకపోయారు!

బిహార్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, టాప్ మ్యాథమెటీషియన్ కృష్ణ చంద్ర సిన్హా ఓడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన JSP నుంచి పోటీ చేసిన ఈయనకు కేవలం 15వేల ఓట్లే వచ్చాయి. ఈయన బీఎస్సీ, ఎంఎస్సీలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. PhD పూర్తి చేశారు. గణితంపై 70 పుస్తకాలు రాశారు. బిహార్లో ఈయనను మహాగురు అని పిలుస్తారు. అయినా రాజకీయాల్లో రాణించలేకపోయారు.


