News July 12, 2024
బీటెక్ విద్యార్థులకు గుడ్న్యూస్

TG: ఇంజినీరింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా(BFSI) కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉండటంతో బీటెక్లో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనుంది. BFSI ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. విద్యార్థులు తమ టెక్నికల్ బ్రాంచీతో పాటే ఈ కోర్సునూ చదవొచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
Similar News
News November 26, 2025
పెద్దపల్లి: జిల్లా కలెక్టర్తో రాణి కుముదిని VC

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.
News November 26, 2025
న్యూస్ అప్డేట్స్ @4PM

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ


