News November 25, 2024
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్
TG: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలపై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో టీ-సాట్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై ఇవాళ్టి నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్‌లు ప్రసారం చేయనున్నట్లు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టీ-సాట్ నిపుణ ఛానల్‌లో మ.12-1 గంటల వరకు, మ.3-4 గంటల వరకు, విద్య ఛానల్‌లో రా.8-10 గంటల వరకు టెలికాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2024
రోహిత్, అశ్విన్, షమీ లేకున్నా హిస్టారిక్ విన్
BGT తొలి టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ, గిల్, అశ్విన్, జడేజా, షమీ జట్టులో లేకపోయినా ప్రత్యర్థి భరతం పట్టింది. రన్స్ పరంగా (295) ఆసిస్‌పై టీమ్ ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2003లో ఆడిలైడ్, 2008లో పెర్త్ విజయాలతో పోలిస్తే ఈ గెలుపు మరపురానిది. తొలి మ్యాచ్‌లోనే కంగారు జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన టీమ్‌ఇండియా ఆసిస్ మాజీ క్రికెటర్ల కలలను కల్లలు చేసింది.
News November 25, 2024
శంషాబాద్ సమీపంలో ఆర్జీవీ?
TG: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆచూకీపై హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ఓ రెస్టారెంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీ కోసం పోలీసులు అక్కడికి వెళ్తున్నారని సమాచారం. అంతకుముందు ఆర్జీవీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా HYDలోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
News November 25, 2024
సంభాల్ హింసకు BJPదే బాధ్యత: రాహుల్ గాంధీ
UP సంభాల్ హింసకు BJPదే బాధ్యతని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అడ్మినిస్ట్రేషన్ అన్ని పక్షాల వాదనను పట్టించుకోలేదని, సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించారు. హిందూ ముస్లిముల మధ్య BJP విభేదాలు సృష్టిస్తోందన్నారు. సుప్రీంకోర్టు త్వరగా జోక్యం చేసుకోవాలని కోరారు. స్థానిక కోర్టు ఆర్డర్‌తో జామా మసీదును సర్వే చేయడానికి వచ్చిన అధికారులపై ముస్లిములు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు.