News March 1, 2025
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్(TPL) రానుంది. జూన్‌లో ఈ లీగ్‌ను ప్రారంభిస్తామని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్ సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు పేర్కొన్నారు. ఈ లీగ్ అందుబాటులోకి వస్తే టీమ్స్‌కు ఏ పేర్లు పెడితే బాగుంటాయో కామెంట్ చేయండి?
Similar News
News December 5, 2025
కోహ్లీ, రూట్ మధ్య సెంచరీల పోటీ!

యాషెస్‌లో తాజా టెస్టు సెంచరీతో ఈ ఫార్మాట్లో రూట్ శతకాల సంఖ్య 40కి చేరింది. కాగా రానున్న రెండేళ్లలో సచిన్ రికార్డులు బద్దలుకొట్టేందుకు కోహ్లీ, రూట్ మధ్య సెంచరీల పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. సచిన్‌కు టెస్టుల్లో 51 సెంచరీలుండగా మరో 11 చేస్తే రూట్ ఆయన సరసన నిలుస్తారు. అటు అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి 84 శతకాలు పూర్తికాగా, మరో 16 చేస్తే మాస్టర్ బ్లాస్టర్ 100 శతకాల రికార్డును చేరుకుంటారు.
News December 5, 2025
ఉప్పును చేతికి ఇవ్వకపోవడానికి శాస్త్రీయ కారణం

ఉప్పుకు తేమను పీల్చుకునే గుణం అధికంగా ఉంటుంది. ఈ కారణం చేతనే ఉప్పును నేరుగా చేతికి ఇవ్వకూడదంటారు. సాధారణంగా చేతిలో చెమట, తడి, బ్యాక్టీరియా ఉంటాయి. ఎవరైనా ఉప్పును చేతితో ఇచ్చినప్పుడు చేతిలో ఉన్న ఆ తేమ, బ్యాక్టీరియాను ఉప్పు గ్రహిస్తుంది. తేమ చేరిన ఉప్పును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఉప్పు కలుషితం కాకుండా ఉండడం కోసం పెద్దలు దానిని నేరుగా చేతికి ఇవ్వవద్దని చెబుతారు.
News December 5, 2025
ఉల్లిని నమ్మి, తల్లిని నమ్మి చెడినవాడు లేడు

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది, ఎటువంటి హాని జరగదు. అలాగే తల్లి తన పిల్లలకు ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటుంది. తల్లి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. తల్లిని నమ్ముకుని, ఆమె మాట విని నడుచుకుంటే జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఎదురవవు. అందుకే ఉల్లిని, తల్లిని నమ్మిన వారు ఎప్పటికీ నష్టపోరని ఈ సామెత వివరిస్తుంది.


