News April 8, 2024

CSKకు గుడ్ న్యూస్

image

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. వీసా పనిపై బంగ్లాదేశ్‌కు వెళ్లిన అతడు గత మ్యాచ్‌కు దూరమయ్యారు. తాజాగా అతడు జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ చెన్నై వేదికగా కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముస్తాఫిజుర్, పతిరణ అందుబాటులో ఉంటారని చెన్నై బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపారు.

Similar News

News January 9, 2025

సోషల్ మీడియాలో మరో హీరోయిన్‌కు వేధింపులు

image

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని హీరోయిన్ నిధి అగర్వాల్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అంతమొందిస్తానని అతడు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యా బెదిరింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె వాపోయారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్‌ను కూడా ఓ వ్యాపారవేత్త వేధించిన విషయం తెలిసిందే.

News January 9, 2025

బిగ్‌బాస్ 18కు చాహల్, శ్రేయస్ అయ్యర్?

image

బిగ్ బాస్ 18లో టీమ్ ఇండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్‌తోపాటు శశాంక్ సింగ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సండే ఈవెంట్‌లో వీరు సందడి చేస్తారని సమాచారం. వీరు ముగ్గురూ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ధనశ్రీ, చాహల్ విడాకులకు శ్రేయస్ అయ్యర్ కారణమంటూ కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆసక్తిగా మారింది.

News January 9, 2025

బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోండి: బీవీ రాఘవులు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారని, 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.