News August 16, 2024
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

ఐపీఎల్లో ప్లేయర్ల రిటైనింగ్పై ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో స్టార్ ప్లేయర్ ధోనీని CSK అన్క్యాప్డ్ కేటగిరీలో తీసుకోనున్నట్లు జాతీయ మీడియా కథనం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్లేయర్లను అన్క్యాప్డ్ ఆటగాళ్లుగా గుర్తించే నిబంధనకు BCCI అనుమతించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇదే నిజమైతే తక్కువ ధరకే మిస్టర్ కూల్‌ని సీఎస్కే సొంతం చేసుకునే అవకాశముంది.
Similar News
News October 26, 2025
దేవాలయ ప్రాంగణంలో పాటించాల్సిన నియమాలు

దేవాలయ ప్రాంగణం పరమ పవిత్ర స్థలం. దైవ దర్శనానంతరం ఆ పవిత్ర స్థలంపై కూర్చుని లౌకిక విషయాలపై చర్చ చేయకూడదు. వ్యాపార, రాజకీయ, అనవసర గృహ విషయాల ప్రస్తావన, వృథా కాలక్షేపాలు దర్శన ఫలాన్ని దూరం చేస్తాయి. దర్శనానంతరం భక్తులు పద్మాసనం/సుఖాసనంలో కూర్చోవాలి. ఈ సమయాన్ని గర్భాలయంలోని దివ్యమంగళ స్వరూపాన్ని, బ్రహ్మానందాన్ని, ఈశ్వరానుభూతిని మనసులో ధ్యానించుకోవాలి. నిశ్చల మనస్సుతో భగవన్నామ స్మరణ చేయాలి.
News October 26, 2025
APPLY NOW: NIOTలో 25 పోస్టులు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) 25 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. డిప్లొమా అప్రెంటిస్‌లకు వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్‌లకు వయసు 21 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://www.niot.res.in/
News October 26, 2025
రాశులు 12 మాత్రమే ఎందుకు? వాటిని ఎలా నిర్ణయించారు?

పూర్వం జ్యోతిషులు సూర్యుడు ప్రయాణించే 360 డిగ్రీల వృత్తాకార మార్గాన్ని 30 డిగ్రీల చొప్పున 12 సమ భాగాలుగా విభజించారు. వాటినే రాశులుగా వ్యవహరించారు. ఈ రాశులకు ఆయా భాగాల్లో కనిపించిన నక్షత్ర సమూహాల ఆకృతిని ఆధారం చేసుకుని మేషం, వృషభం, తులా.. ఇలా పేర్లను నిర్ణయించారు. వీటి ఆధారంగానే ఫ్యూచర్‌ను అంచనా వేసి రాశి ఫలాలను చెబుతుంటారు. మీ రోజూవారి <<-se_10008>>రాశిఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.


