News March 18, 2025

మందుబాబులకు గుడ్ న్యూస్!

image

TG: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్త బీర్లు అమ్మేందుకు TGBCLకు దాదాపు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుంది. అన్ని పూర్తయితే ఏప్రిల్ నుంచి అమ్మకాలు జరిపేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.

Similar News

News January 30, 2026

అమరావతిలో వీధి పోటు పాట్లు… పరిష్కారానికి GO

image

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను కొత్త సమస్య వెంటాడుతోంది. రిటర్న్‌బుల్ ప్లాట్లు అందుకున్న పలువురికి వీధిపోటు తలనొప్పిగా మారింది. వాస్తుప్రకారం వీధిపోటు ఉంటే ప్రతికూలత, అశుభం అనే భావన ఉండడంతో వాటిని మార్చాలని వారు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. దీంతో పడమర, నైరుతి, దక్షిణం, ఆగ్నేయం దిక్కులు, ఇతర చోట్ల వీధి శూలలున్న ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేలా ప్రభుత్వం GO ఇచ్చింది.

News January 30, 2026

16ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధించండి: సోనూసూద్

image

సోషల్ మీడియా వినియోగంపై నటుడు సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు భోజనం చేస్తూ ఫోన్లలో మునిగిపోవడం ఆందోళనకరమని, 16 ఏళ్ల లోపు వారికి SMను నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. AP ఈ దిశగా అడుగులు వేసిందని, గోవా కూడా అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని జాతీయ ఉద్యమంగా మార్చాలని సోనూసూద్ X వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్?

News January 30, 2026

BC రిజర్వేషన్ జీవోలపై స్టే కొనసాగుతుంది: హైకోర్టు

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన జీవో(9, 41, 42)ల అమలుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన వాటితోపాటు తమ వాదనలు కూడా వినాలని పలువురు కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ విచారించింది.