News September 11, 2024

DSC అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: DSC అభ్యర్థులు తమ టెట్ వివరాలను ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. DSCలో వచ్చిన మార్పులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల DSC ఫైనల్ కీ విడుదల కాగా, 2-3 రోజుల్లో ఫలితాలూ రానున్నాయి. ఈ క్రమంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.

Similar News

News February 2, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది.

News February 2, 2026

వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

image

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.

News February 2, 2026

ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

image

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం