News July 29, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచింది. దీనిని రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది.

Similar News

News April 2, 2026

UIDAIకి డేటా ఇచ్చేందుకు నో చెప్పిన EC?

image

మరణించిన ఓటర్ల వివరాలను ఇవ్వాలన్న UIDAI రిక్వెస్ట్‌ను ఎన్నికల కమిషన్ (ECI) తిరస్కరించినట్లు సమాచారం. ఓటర్ల జాబితా సమీక్ష (SIR) ద్వారా గుర్తించిన మృతుల డేటా ఇస్తే ఆధార్ డేటాబేస్‌ను అప్‌డేట్ చేస్తామని UIDAI కోరగా.. అందుకు కమిషన్ ఒప్పుకోలేదని తెలిసింది. తమది స్వతంత్ర సంస్థ అని, ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇతర ప్రభుత్వ విభాగాలతో పంచుకోలేమని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

News April 2, 2026

రేపు వడగాలుల ఎఫెక్ట్ ఎక్కడంటే?

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ కడప(D) పొట్టిపాడులో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు అల్లూరి, మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం దాదాపు 58 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 2, 2026

ఢిల్లీ సూపర్ విక్టరీ

image

IPL-2026: లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (0), నిస్సాంక (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ (70*) కీలక ఇన్నింగ్సుతో తన జట్టును గెలిపించారు. స్టబ్స్ 39* పరుగులతో రాణించారు. మరో 17 బంతులు మిగిలి ఉండగానే అక్షర్ సేన విక్టరీ అందుకుంది.