News April 11, 2024
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. EPFO వేతన పరిమితి పెంచనున్న కేంద్రం!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది. వచ్చే కొత్త ప్రభుత్వంలో దీనిపై నిర్ణయం వెలువడొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.15 వేలు కాగా ఆ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపైనా భారం పడుతుంది. అయితే EPFO ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరిగి ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.
Similar News
News March 26, 2026
IPL: RCB-SRH మ్యాచ్ జరుగుతుందా?

ఎల్లుండి సాయంత్రం IPLలో RCB-SRH ప్రారంభ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ మ్యాచ్ జరగనున్న చిన్నస్వామి స్టేడియం మాత్రం ఇంకా రెడీ కాలేదు. గతేడాది తొక్కిసలాట తర్వాత రెనోవేషన్ పనులు చేపట్టగా తొలి మ్యాచ్ రోజు నాటికి పూర్తవుతుందా అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి స్టేడియం పనుల పూర్తికి ఈ నెల 15 డెడ్‌లైన్ కాగా పనులన్నీ ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరో 48 గంటల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
News March 26, 2026
రేపు జాగ్రత్త: APSDMA

AP: రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మన్యం (D) గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అల్లూరి(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ(D) జగ్గంపేట, తూ.గో.(D) కోరుకొండ, ఎన్టీఆర్(D) జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యవసరమైతేనే బయటకు రావాలంది. మంచి నీరు, మజ్జిగ, ORS ఎక్కువగా తాగాలని సూచించింది.
News March 26, 2026
కొత్తగా 620 డ్రైవింగ్ స్కూళ్లతో కోటి ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ

దేశంలోని 120 జిల్లాలు, 500 బ్లాకు(జిల్లా సబ్‌డివిజన్)ల్లో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూళ్లు ఓపెన్ చేసిందని పేర్కొన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు.


