News August 24, 2024
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రెండు డీఏలు విడుదల?

TG: ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో రెండింటిని మంజూరు చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ చెల్లింపుల వివరాలను ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు ప్రతి 6 నెలలకోసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 3, కాంగ్రెస్ వచ్చాక ఒక డీఏ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.
Similar News
News March 28, 2026
విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏప్రిల్‌లో భూమి పూజ?

AP: విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిర్మాణ అనుమతుల కోసం బిల్డింగ్ ప్లాన్‌ను సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. పర్యావరణానికి నష్టం లేకుండా చెరువులు, నీటి కుంటలను యథాతథంగా ఉంచుతూ అభివృద్ధి చేస్తామని తెలిపింది. అనుమతులు రాగానే ఏప్రిల్‌లో భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 601 ఎకరాలను కేటాయించింది.
News March 28, 2026
అనిరుధ్‌తో కావ్యా మారన్ పెళ్లి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వారు డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. వారిద్దరూ కలిసి కనిపించడం, SRHకు సాంగ్ కంపోజ్ చేయడం దీనికి బలాన్ని చేకూర్చాయి. అనిరుధ్ గతంలో ఆ వార్తలను ఖండించినప్పటికీ వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందంటూ తాజాగా తమిళ మీడియా పేర్కొంటోంది.
News March 28, 2026
మలబద్ధకమా? ఈ టిప్స్ మీ కోసమే

వైద్యపరంగా వారానికి మూడు కంటే తక్కువసార్లు విసర్జన అవుతుంటే దాన్ని మలబద్ధకంగా భావిస్తారు. ఎక్కువ రోజులు ఈ సమస్య ఉంటే పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, అవిసె గింజలు, సబ్జా, యోగర్ట్ వంటి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు 8-10 గ్లాసుల నీరు తాగాలి. రోజూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
Share It


