News October 13, 2024
రైతులకు శుభవార్త

TG: రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సోలార్ పంపు సెట్లతో రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. పంట, పవర్‌తో రైతులు అదనపు లాభం పొందేలా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు చేడతాం’ అని ఆయన ప్రకటించారు.
Similar News
News January 23, 2026
సిట్ విచారణకు వెళ్లే ముందు KTR ప్రెస్ మీట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, BRS కీలక నేత KTR నేడు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. అంతకుముందు 9:30 గంటలకు ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతలతో సమావేశం అనంతరం 10 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఇదే కేసులో మరో కీలక నేత హరీశ్‌రావును ఇటీవలే సిట్ విచారించిన విషయం తెలిసిందే.
News January 23, 2026
శీతాకాలంలో పసిపిల్లల సంరక్షణ

శీతాకాలంలో నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడూ వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చోనివ్వాలి. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
News January 23, 2026
‘పెద్ది’పై క్రేజీ అప్డేట్.. చరణ్‌తో మృణాల్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్‌తో అలరించబోతున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీ కోసం మేకర్స్ అడిగిన వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. AR రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ సిద్ధం చేయగా ఈ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించబోతున్నారని టాక్. ‘సీతారామం’తో తెలుగువారి మనసు గెలుచుకున్న ఈ భామ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుందనే వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది.


