News January 14, 2025
రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!
TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌ను తొలుత NZB(D) బోధన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.
Similar News
News January 14, 2025
నిద్రలో కింద పడిపోతున్నట్లు అనిపిస్తోందా?
చాలామంది నిద్రలోకి జారుకోగానే కిందపడిపోతున్నామనే ఫీలింగ్ వచ్చి జెర్క్ ఇస్తారు. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. నిద్రపోతుండగా శరీర కండరాల్లో కదలికల వల్లే ఈ ఆకస్మిక కుదుపులు సంభవించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, అలసట కూడా కారణాలేనట. అయితే నిద్ర డిస్టర్బ్ కావడం, తరచూ దీనికి గురైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 14, 2025
ఐకానిక్ చిత్రం స్థానంలో ‘కర్మ క్షేత్ర’.. సమర్థించుకున్న ఆర్మీ చీఫ్
1971 వార్‌లో పాక్ ఆర్మీ లొంగుబాటు సందర్భంగా తీసిన పిక్చర్ వెరీ ఫేమస్. న్యూఢిల్లీ రైసీనా హిల్ ఆఫీస్‌లో ఉన్న ఆ ఫొటో స్థానంలో ‘కర్మ క్షేత్ర’ పెయింటింగ్‌ను ఉంచడాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర సమర్థించుకున్నారు. ‘ఆర్మీలో జనరేషన్ల మార్పును సూచిస్తూ కల్నల్ థామస్ దీన్ని రూపొందించారు’ అని తెలిపారు. ‘దేశ విలువలు, ధర్మాన్ని రక్షించే పాత్రలో సైన్యం, టెక్నాలజీని ఇది ప్రతిబింబిస్తుంది’ అని ఆర్మీ పేర్కొంది.
News January 14, 2025
జనవరి 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు
రిపబ్లిక్ డే నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం విషయాల్లో అన్ని మతాలకు ఉమ్మడి చట్టం అమలు కోసమే UCC తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు సాక్షుల వీడియోలను రికార్డు చేయాల్సి ఉంటుంది. కామన్ పోర్టల్ ఉంటుంది.